Bulli Tirupati

Click here to edit subtitle

స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీవిజయ నామ సంవత్సర చైత్ర బహుళ దశమి స్థిరవారం, అనగా ది. 04-05-2013 వ తేది నుండి ది. 06-05-2013 ద్వాదశి సోమవారం వరకు లోక సంరక్షణార్ధం బుల్లి తిరుపతిగా పేరొందిన అత్తిలి మండలం ఈడూరు గ్రామంలో శ్రీ భూ సామేత శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణము నందు నక్షత్ర గుండాత్మక శ్రీ వరాల వేంకటేశ్వర మహాయాగమును 31 మంది దంపతులచే 35 మంది ఋత్విక్కులతో 31 హోమగుండములతో వైఖానస ఆగమ ప్రకారం త్రయాహ్నిక దీక్షతో అతి వైభవంగా జరపబడును.

కావున భక్తులెల్లరూ మహాయాగమునందు పాల్గొని కార్యక్రమములను తిలకించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించ ప్రార్ధన.

మంగళమ్ మహత్

శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ


విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, ఋత్విక్ వరుణ, దీక్షాధారణ, మృత్సంగ్రహణ (పుట్ట మట్టి తెచ్చుట), అగ్ని మధనం, అగ్ని ప్రతిష్ఠాపన, వాస్తు పూజ, వాస్తు హోమం, ద్వజారోహణ, శ్రీ వరాల వేంకటేశ్వర సుదర్శన నక్షత్రేష్ఠి మహాయాగం, దిగ్దేవతాబలి, చతుర్వేద స్వస్తి, పంచహారతులు, తీర్ధ ప్రసాద వినియోగం.

సామూహిక విష్ణు సహస్రనామ పారాయణ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, చతుర్ధశకలశారాధన, ఉత్సవ మూర్తులకు మహాభిషేకం, శ్రీ వరాల వేంకటేశ్వర సుదర్శన నక్షత్రేష్ఠి మహాయాగం, పుత్రకామేష్టి పాయసహోమం (సంతాన ప్రాప్తి కోసం), చతుర్వేద స్వస్తి, పంచహారతులు, తీర్ధ ప్రసాద వినియోగం.

గ్రామోత్సవం, విష్ణు సహస్రనామ పారాయణ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, సహస్ర దీపాలంకార సేవ, స్వామి వారికి పంచశయ్యాదివాసం, హౌత్రమ్, శ్రీ వరాల వేంకటేశ్వర సుదర్శన నక్షత్రేష్ఠి మహాయాగం, సర్వదైత్య, పారమాత్మిక మహాశాంతియాగం, చతుర్వేద స్వస్తి, పంచహారతులు, తీర్ధ ప్రసాద వినియోగం.

విష్ణు సహస్రనామ పారాయణ, విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనము, ప్రదాన హోమములు, శ్రీ వరాల వేంకటేశ్వర సుదర్శన నక్షత్రేష్ఠి మహాయాగం, దాతాధిమూల హోమములు, మహాపూర్ణాహుతి అనంతరం ఆలయ శిఖరమునకు మహాకుంభాభిషేకం, అనంతరం స్వామివారికి శాంతి కళ్యాణం, మహదాశీర్వచనం, పండిత సత్కారములు, పంచహారతులు, తీర్ధ ప్రసాద వినియోగం.

సర్వేజనాః సుఖినోభవంతు

సకల లోకాధిపతి దేవతా సార్వభౌముడు కలియుగ ప్రత్యక్ష దేవుడు సృష్టి స్థితి లయకారకుడు అగు శ్రీ వేంకటేశ్వర స్వామి యొక్క దర్శన భాగ్యమే ఈ కలియుగంలో ముక్తిమార్గం. మానవుడు సంఘజీవి కనుక తన సుఖశాంతులే కాక సమాజంలో అందరి సుఖశాంతులను కోరాలి. కనుక అందరూ సుఖంగా ఉండాలి. అందరికీ మంచి బుద్ధి సిద్ధించాలని, సర్వజనులు సుఖశాంతులతో ఉండాలని, ఆలయ దినదినాభివృద్ధి సాధించాలని ఈ యాగ ప్రధాన సంకల్పం. శ్రీ వరాల వేంకటేశ్వర స్వామి వారికి అమితమైన శక్తులు ఈ యాగం ద్వారా కలుగుతాయి. ఈ యాగంలో పాలుపంచుకున్న దంపతులకు మరియు సర్వులకు శ్రీవారి అనుగ్రహం వల్ల సర్వ దోష నివృత్తి మరియు నక్షత్ర దోషాలు నివారణగును. సర్వ శుభాలు, సుఖశాంతులు కలుగును. సంతానం లేనివారికి సంతానం సిద్ధించును. ఉద్యోగ, వ్యాపార, చెరువుల అభివృద్ధి కలుగును. గ్రామం, రాష్ట్రం, దేశం అన్నీ విధాల సుఖశాంతులతో తులతూగెదను.

ఇట్లు
శ్రీవారి సేవాబృందం, పురజనులు,
ఈడూరు (బుల్లి తిరుపతి).